కనీస వేతనం 10,500కు పెంచండి | Increase the minimum wage to 10,500 | Sakshi
Sakshi News home page

కనీస వేతనం 10,500కు పెంచండి

Mar 8 2017 12:02 AM | Updated on Sep 5 2017 5:27 AM

గ్రామ పంచాయతీల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనం రూ.10,500లకు పెంచాలని గ్రామ పంచాయతీ

గ్రామ పంచాయతీ, సర్పంచ్‌ల సంఘం విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: గ్రామ పంచాయతీల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనం రూ.10,500లకు పెంచాలని గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చక్రధర్, సర్పంచ్‌ల సంఘం ప్రధాన కార్యదర్శి చెల్లాపురం వెంకట్‌ గౌడ్, వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న యాదవ్‌ ప్రభుత్వాన్ని కోరారు.

ఈ మేరకు మంగళవారం సచివాలయంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, అటవీశాఖ మంత్రి జోగు రామన్నను కలసి విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మారుమూల గ్రామాల్లో కరెంట్, వీధిలైట్లు, రోడ్లకు నిధులు మంజూరు చేయాలని కోరారు. బుధవారం జరిగే కేబినెట్‌ సమావేశంలో దీనిపై  చర్చ జరపాలని మంత్రులకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement