గవర్నర్ను కలిసి అభినందించా: వీహెచ్ | I appreciate Govenrnor Narasimhan, says V Hanumantha rao | Sakshi
Sakshi News home page

గవర్నర్ను కలిసి అభినందించా: వీహెచ్

Mar 3 2014 2:30 PM | Updated on Sep 19 2019 8:28 PM

గవర్నర్ను కలిసి అభినందించా: వీహెచ్ - Sakshi

గవర్నర్ను కలిసి అభినందించా: వీహెచ్

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ముందు కిరణ్ కుమార్ రెడ్డి చేసిన సంతకాల పైళ్లను సమీక్షిస్తామన్నందుకు గవర్నర్ నరసింహన్కు కలిసి అభినందించినట్లు రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు తెలిపారు.

హైదరాబాద్ : ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ముందు కిరణ్ కుమార్ రెడ్డి చేసిన సంతకాల పైళ్లను సమీక్షిస్తామన్నందుకు గవర్నర్ నరసింహన్కు కలిసి అభినందించినట్లు రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు తెలిపారు. సోమవారం ఆయన గవర్నర్కు కలిశారు. అనంతరం వీహెచ్ విలేకర్లతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికలప్పుడే బీసీల జపం చేస్తారని విమర్శించారు.

 

సీమాంధ్ర టీడీపీ అధ్యక్ష పదవిని చంద్రబాబు బీసీలకు కట్టబెట్టాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేయొద్దంటూ ఆయన కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తున్నట్లు తమ వద్ద సమాచారం ఉందన్నారు. టీఆర్ఎస్ లక్ష్యం తెలంగాణయే అన్నప్పుడు కాంగ్రెస్ ఎంపీలను పార్టీలో ఎందుకు చేర్చుకుంటున్నారని వీహెచ్ ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement