వేతనాలివ్వకుంటే ఎలా బతకాలి? | How not acknowledge wages | Sakshi
Sakshi News home page

వేతనాలివ్వకుంటే ఎలా బతకాలి?

Sep 12 2016 10:43 PM | Updated on Sep 4 2017 1:13 PM

డీఈఓ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న విద్యావలంటీర్ల

డీఈఓ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న విద్యావలంటీర్ల

ఇన్ని రోజులుగా పనిచేస్తున్నాం.. చేసిన పనికి వేతనాలివ్వకపోతే మేమెలా బతకాలి.. కుటుంబపోషణ కష్టమవుతోంది అంటూ విద్యావలంటీర్లు ఆవేదన వ్యక్తంచేశారు.

సాక్షి, సిటీబ్యూరో: ఇన్ని రోజులుగా పనిచేస్తున్నాం.. చేసిన పనికి వేతనాలివ్వకపోతే మేమెలా బతకాలి.. కుటుంబపోషణ కష్టమవుతోంది అంటూ విద్యావలంటీర్లు ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్‌ జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) కార్యాలయం ముందు సోమవారం విద్యావలంటీర్లు మెరుపు ధర్నా చేశారు. గత డిసెంబర్‌ నుంచి వేతనాలు అందని 150 మంది దాదాపు 2 గంటలపాటు బైఠాయించి నినదించారు. అధికారులు వేతనాలు విడుదల చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం కనబరుస్తున్నారని వారు ప్రశ్నించారు. నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా.. ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.  గతేడాది నిధులు సమృద్ధిగా ఉన్నా కార్యాలయ ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగా వేతనాలకు నోచుకోలేదని వివరించారు.

వేతనాలు సకాలంలో అందడం లేదన్న కారణంగా చాలా మంది విధులకు దూరమవుతున్నారని హైదరాబాద్‌ జిల్లా విద్యావలంటీర్ల ప్రతినిధి సీహెచ్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే.. మూకుమ్మడిగా విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు. ధర్నాకు టీఎస్‌యూటీఎఫ్‌ హైదరాబాద్‌ శాఖ మద్ధతు తెలిపింది. కార్యక్రమంలో మంజుల, అనిత, రిజ్వానా ఫాతిమా, సబాబేగం, సౌజన్య, కుమార్, టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్‌. వై కొండలరావు, డి. సంజీవరావు, శారద, రామకృష్ణ, నర్సింహారెడ్డి, రమేష్‌లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement