జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యావలంటీర్ల వేతనాల నిధులు మంజూరయ్యాయి. జిల్లాలో 467 మంది విద్యావలంటీర్ల వేతనాలకు సంబంధించి రూ.89లక్షలు విడుదలయ్యాయని డీఈఓ పి.రాజీవ్ తెలిపారు.
విద్యావలంటీర్ల వేతనాలు విడుదల
Sep 4 2016 12:36 AM | Updated on Sep 4 2017 12:09 PM
విద్యారణ్యపురి : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యావలంటీర్ల వేతనాల నిధులు మంజూరయ్యాయి. జిల్లాలో 467 మంది విద్యావలంటీర్ల వేతనాలకు సంబంధించి రూ.89లక్షలు విడుదలయ్యాయని డీఈఓ పి.రాజీవ్ తెలిపారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో విద్యావలంటీర్లకు వేతనాలు ఇవ్వకుండా ల్యాప్స్ చేసిన ఎంఈఓలు ఆయా నెలలతో పాటు జూన్ నెల వేతనాలు అందజేయాలని, అప్పట్లో ఇచ్చిన వారికి కేవలం జూన్ వేతనం చెల్లించాలని ఆయన సూచించారు. ఒక్కో విద్యావలంటీర్‌కు రూ.8వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుందని డీఈఓ తెలిపారు.
Advertisement
Advertisement


