తెలంగాణ ప్రభుత్వం 123 జీవో రద్దుపై శుక్రవారం హైకోర్టులో అప్పీల్ చేసింది.
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం 123 జీవో రద్దుపై శుక్రవారం హైకోర్టులో అప్పీల్ చేసింది. ఈ అంశంపై డివిజన్ బెంచ్ పూర్తి వాదనలు విన్నది. అనంతరం తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. అయితే నిబంధనల ప్రకారమే నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తున్నామని... వ్యవసాయ కూలీలను ఆదుకుంటామని అడ్వకేట్ జనరల్ (ఏజీ) హైకోర్టుకు విన్నవించారు. అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఏజీని హైకోర్టు కోరింది.