ప్రత్యూష తండ్రి, పిన్నిలకు బెయిల్ నిరాకరణ | high court rejects bail to prathyusha father, aunt | Sakshi
Sakshi News home page

ప్రత్యూష తండ్రి, పిన్నిలకు బెయిల్ నిరాకరణ

Sep 8 2015 7:00 PM | Updated on Aug 31 2018 8:24 PM

ప్రత్యూష తండ్రి, పిన్నిలకు బెయిల్ నిరాకరణ - Sakshi

ప్రత్యూష తండ్రి, పిన్నిలకు బెయిల్ నిరాకరణ

ప్రత్యూషను చిత్రహింసలకు గురిచేసిన కేసులో ఆమె తండ్రి రమేష్, పిన్ని చాముండేశ్వరిలకు బెయిల్ దక్కలేదు.

హైదరాబాద్: ప్రత్యూషను చిత్రహింసలకు గురిచేసిన కేసులో ఆమె తండ్రి రమేష్, పిన్ని చాముండేశ్వరిలకు బెయిల్ దక్కలేదు. ఈ కేసును విచారిస్తున్న హైకోర్టు ప్రత్యూష్ తండ్రి, పిన్నిలకు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది.

ప్రత్యూషను ఆమె పిన్ని తీవ్రంగా హింసించి.. యాసిడ్ తాగించినట్టుగా వచ్చిన పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటా స్వీకరించింది. రమేష్, చాముండేశ్వరిలను అరెస్ట్ చేసి, ప్రత్యూషను ఆస్పత్రికి తరలించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రత్యూషను పరామర్శించి ఆమె సంరక్షణ బాధ్యతను తీసుకుంటామని చెప్పారు. ఆస్పత్రిలో కోలుకున్న అనంతరం ప్రత్యూష నేరుగా కేసీఆర్ ఇంటికి వెళ్లింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement