
అమెరికా పర్యాటకుడు ఫ్రీజర్‌కు సాయం
అమెరికా నుంచి దక్షిణ భారతదేశంలో పర్యటించడానికి వచ్చిన జాన్ ఫ్రీజర్‌కు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయం అందించింది.
ఆయన దుస్థిపై పత్రికలలో వచ్చిన కథనాలకు స్పందించిన వెంక టేశం జాన్ స్వదేశానికి వెళ్లేందుకు పాస్ పోర్టు, వీసాలపై అమెరికా కాన్సులేట్, ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి సహకరిం చారు. దక్షిణ భారతదేశ భాషా, సంస్కృతి సంప్రదాయాలు, భాష నేర్చుకోవడం, ప్రజల జీవన విధానం పరిశీలనకు పర్యటిస్తు న్నట్లు జాన్ వెల్లడించారు.