చింతల్‌కుంటలో భారీ ట్రాఫిక్‌ జాం | heavy traffic jam at chintalkunta check post | Sakshi
Sakshi News home page

చింతల్‌కుంటలో భారీ ట్రాఫిక్‌ జాం

Published Tue, Jun 6 2017 4:50 PM | Last Updated on Tue, Sep 5 2017 12:57 PM

ల్బీనగర్ చింతల్ కుంట చెక్ పోస్ట్ వద్ద భారీగా ట్రాఫిక్‌ జాం అయింది.

హైదరాబాద్: ఎల్బీనగర్ చింతల్ కుంట చెక్ పోస్ట్ వద్ద ప్లై ఓవర్ కోసం తీసిన గుంతలో పడి మృతి చెందిన రాఘవేందర్, గాయపడిన అశోక్, సాయి కిరణ్ కుటుంబాలకు న్యాయం చేయాలంటూ బాధితుల బంధువులు ఆందోళన చేపట్టారు. మధ్యాహ్నం నుంచి జాతీయరహదారిపై వారు చేపట్టిన రాస్తారోకోతో మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సోమవారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటనలో మృతుడు, క్షతగాత్రులు బడంగ్ పేట్ కు చెందిన వారిగా గుర్తించారు. బాధితులు ఒవైసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిరసన తెలుపుతున్న బాధితుల కుటుంబీకులకు విద్యార్థి సంఘాల వారు మద్దతు తెలిపారు.

Advertisement

పోల్

Advertisement