
'మొత్తం 2,969 నామినేషన్లు దాఖలు'
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మొత్తం 2969 నామినేషన్లు దాఖలయ్యాయని కమిషనర్ బి.జనార్దన్రెడ్డి తెలిపారు.
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మొత్తం 2969 నామినేషన్లు దాఖలయ్యాయని కమిషనర్ బి.జనార్దన్రెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో మీడియాతో కమిషనర్ జనార్దన్రెడ్డి మాట్లాడుతూ.. నామినేషన్ల ప్రక్రియ ఆదివారంతో పూర్తి అయిందని చెప్పారు.
టీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా 698 నామినేషన్లు దాఖలు చేసిందని... అలాగే టీడీపీ 506, కాంగ్రెస్ 501, బీజేపీ 308, బీఎస్పీ 82, ఎంఐఎం 61, లోక్సత్తా 31, సీపీఎం 29, సీపీఐ 28 నామినేషన్లు దాఖలు చేశాయని జనార్దన్రెడ్డి వివరించారు. నామినేషన్ల పరిశీలన సోమవారం జరుగుతుందన్నారు.