
కేటీఆర్ సతీమణి ఓటేశారు..
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంగళవారం ఉదయం హిమాయత్ నగర్ 9వ నెంబర్ వీధిలోని సెయింట్ ఆంటోని స్కూల్ పోలింగ్ కేంద్రంలో శైలిమ ఓటు వేశారు. హైదరాబాద్లో శైలిమకు ఓటు హక్కు లేదని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయం చర్చనీయాంశమైంది. శైలిమకు హిమాయత్ నగర్లో ఓటు ఉన్నట్టు అధికారులు గుర్తించడంతో ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు.
బంజారాహిల్స్ రోడ్ నం.14లోని నందినగర్‌లో మంత్రి కేటీఆర్ నివసిస్తారు. కేటీఆర్కు ఈ డివిజన్లోనే ఓటు హక్కు ఉండగా, శైలిమకు మాత్రం ఇక్కడ ఓటు లేదు. కేటీఆర్ బంజారాహిల్స్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.