గ్రేటర్ లో కొనసాగుతున్న కౌంటింగ్ | GHMC election counting continuous in 24 centres | Sakshi
Sakshi News home page

గ్రేటర్ లో కొనసాగుతున్న కౌంటింగ్

Feb 5 2016 3:52 PM | Updated on Sep 3 2017 5:01 PM

గ్రేటర్ లో కొనసాగుతున్న కౌంటింగ్

గ్రేటర్ లో కొనసాగుతున్న కౌంటింగ్

జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఆరంభించారు.మరోవైపు కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.  మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఆరంభించారు. మొత్తం 24 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని వీడియోలో చిత్రీకరిస్తున్నారు. ఇక కౌంటింగ్ హాల్లోకి సెల్ఫోన్లు, అలాగే ఎన్నికల ఫలితాల అనంతరం ర్యాలీలు, విజయోత్సవాలపై నిషేధం విధించారు.

 

సాయంత్రం అయిదు గంటల తర్వాతే ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. మరోవైపు కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. అలాగే 144 సెక్షన్ కొనసాగుతోంది. అలాగే మసబ్ ట్యాంక్ లో కౌంటింగ్ జరుగుతోంది. మోహదీపట్నం, అహ్మద్ నగర్, విజయనగర్ కాలనీ, ఆసిఫ్ నగర్, మల్లేపల్లి, రెడ్ హిల్స్ డివిజన్లలో కౌంటింగ్ మొదలైంది. ఇక పాతబస్తీ పురానాపూల్ డివిజన్లో రీపోలింగ్ కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement