శోభాయాత్రకు సిద్ధమవుతున్న 'మహా'గణపతి | ganesh nimajjanam in hyderabad city | Sakshi
Sakshi News home page

శోభాయాత్రకు సిద్ధమవుతున్న 'మహా'గణపతి

Sep 27 2015 4:07 PM | Updated on Sep 3 2017 10:05 AM

శోభాయాత్రకు సిద్ధమవుతున్న 'మహా'గణపతి

శోభాయాత్రకు సిద్ధమవుతున్న 'మహా'గణపతి

ఖైరతాబాద్ మహా వినాయకుడు గణేశుడి శోభాయాత్రకు సిద్ధమవుతున్నాడు.

హైదరాబాద్: ఖైరతాబాద్ మహా వినాయకుడు శోభాయాత్రకు సిద్ధమవుతున్నాడు. త్రిశక్తిమయ మోక్షగణపతి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రాకతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. హుస్సేన్ సాగర్ వద్దకు జనాలు భారీగా చేరుకుంటున్నారు. ఇప్పటి వరకు 25 వేల గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేశారని పోలీసులు తెలిపారు. నగరంలో వినాయక నిమజ్జన ఏర్పాట్లను జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ సమీక్షిస్తున్నారు.

హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్కు చెందిన 25వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement