బీసీ హాస్టళ్లకూ నిధులివ్వండి | Fund for BC Hostels | Sakshi
Sakshi News home page

బీసీ హాస్టళ్లకూ నిధులివ్వండి

Aug 22 2017 3:49 AM | Updated on Sep 17 2017 5:48 PM

బీసీ హాస్టళ్లకూ నిధులివ్వండి

బీసీ హాస్టళ్లకూ నిధులివ్వండి

రెడ్డి హాస్టల్‌కు రూ.10 కోట్లతో పాటు పదె కరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని, పేదలు, వెనుక బడిన వర్గాలు చదువుకుంటున్న బీసీ గురుకులాలకు కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌. కృష్ణయ్య డిమాండ్‌ చేశారు.

ఆర్‌. కృష్ణయ్య డిమాండ్‌
సాక్షి, హైదరాబాద్‌: రెడ్డి హాస్టల్‌కు రూ.10 కోట్లతో పాటు పదె కరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని, పేదలు, వెనుక బడిన వర్గాలు చదువుకుంటున్న బీసీ గురుకులాలకు కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌. కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. ఒక్కో వసతిగృహం, గురుకులానికి రూ.10 కోట్ల చొప్పున నిధులు కేటాయిం చడంతో పాటు శాశ్వత భవనాలు నిర్మించేందుకు భూములు ఇవ్వాలని కోరుతూ సోమవారం ఆయన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ హాస్టళ్లు అద్దెభవనాల్లో అరకొర సౌకర్యాలతో నడుస్తున్నా యని.. దీంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement