చదివింది మూడు.. మోసాల్లో పీజీ | Fraudulent offers Job for money in hyderabad | Sakshi
Sakshi News home page

చదివింది మూడు.. మోసాల్లో పీజీ

May 29 2016 1:56 PM | Updated on Sep 4 2017 1:12 AM

చదివింది మూడు.. మోసాల్లో పీజీ

చదివింది మూడు.. మోసాల్లో పీజీ

మూడో తరగతి చదివిన ఓ యువకుడు మోటారు వెహికల్ ఇన్స్‌స్పెక్టర్ పోస్టులు ఇప్పిస్తానని డబ్బులు దండుకోవడంతో జూబ్లీహిల్స్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

బంజారాహిల్స్: మూడో తరగతి చదివిన ఓ యువకుడు మోటారు వెహికల్ ఇన్స్‌స్పెక్టర్ పోస్టులు ఇప్పిస్తానని డబ్బులు దండుకోవడంతో జూబ్లీహిల్స్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే..కృష్ణాజిల్లా కలిగింగిడి మండలం సంతోష్‌పురం గ్రామానికి చెందిన మెండ్యాల తిరుపతయ్య అలియాస్ తిరుమలరాజు (33) శ్రీకృష్ణనగర్‌లో నివాసముంటూ నందగిరి హిల్స్‌లో ఉండే రాజీవ్‌గాంధీ ఏవియేషన్ అకాడమీ చీఫ్ ట్రైనర్ వైపి రెడ్డి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి

కృష్ణా జిల్లా కోడూరు గ్రామానికి చెందిన పామర్తి శ్రీనివాసరావు ఇటీవల పరిచయం కాగా, తనకు టీఎస్‌పీఎస్సీలో బాగా పరిచయాలు ఉన్నట్లు నమ్మించి ఏఎంవీఐ పోస్టు ఇప్పిస్తానని చెప్పి రూ. 40 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. మొదటి విడతగా రూ. 15,88 లక్షలు వసూలు చేశాడు. ఇటీవల వెలువడిన ఫలితాల్లో శ్రీనివాసరావు పేరు కనిపించకపోవడంతో బాధితుడు వారిని నిలదీయగా మిగతా మొత్తం కూడా ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో తాను మోసయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తిరుపతయ్యతో పాటు అతనికి సహకరించిన  ఎస్‌కె యాకూబ్‌అలీ అలియాస్ కోటేశ్వరరావు (31), మహ్మద్ అలీ (51), మీర్ అక్బర్ అలీ (51) లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement