పెళ్లి అంటే.. బ్రోతల్ కేసు పెడతా.. | Fraud in the name of love | Sakshi
Sakshi News home page

పెళ్లి అంటే.. బ్రోతల్ కేసు పెడతా..

Nov 12 2015 7:11 PM | Updated on Sep 4 2018 5:07 PM

పెళ్లి అంటే.. బ్రోతల్ కేసు పెడతా.. - Sakshi

పెళ్లి అంటే.. బ్రోతల్ కేసు పెడతా..

ప్రేమ పేరుతో ఓ యువతిని మోసగించిన ఆక్సిజన్ ఆస్పత్రి డాక్టర్ రణథీర్.

ప్రేమించానన్నాడు... పెళ్లి చేసుకుంటానన్నాడు... శారీరకంగా ఒక్కటయ్యారు.. గర్భం దాల్చితే ట్యాబ్లెట్‌లు ఇచ్చి అబార్షన్ చేయించాడు.. జర్మనీలో పీజీ చేసి వచ్చి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు.. తీరా పెళ్లెప్పుడని నిలదీస్తే.. రూ.8 కోట్లు కట్నం ఇస్తేనే తాళి కడతానంటూ షరతు పెట్టాడు. అంతటితో ఆగలేదు... పెళ్లీగిళ్లీ అంటూ వెంటపడ్డావంటే బ్రోతల్ కేసులో ఇరికిస్తా.. అంటూ బెదిరించాడు.. ఇదీ ప్రేమించిన అమ్మాయికి ఓ యువవైద్యుడి నుంచి ఎదురైన 'ట్రీట్‌మెంట్'..  

జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. దిల్‌సుక్‌నగర్‌లో నివాసం ఉండే ఎన్.రణధీర్‌రెడ్డి(27) ఎంబీబీఎస్ పూర్తిచేసి నగరంలోని ఆక్సిజన్ ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. తొమ్మిది నెలల క్రితం యూసుఫ్‌గూడ జవహర్ నగర్‌కు చెందిన యువతి(25)తో 'వీ-చాట్' లో పరిచయం పెంచుకున్నాడు. కొన్నిరోజుల తర్వాత నేరుగా యువతి ఇంటికి వచ్చి ప్రేమిస్తున్నానని, ఒకే కులం కావడంతో పెళ్లికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని నమ్మించాడు. దాంతో శారీరకంగా కూడా ఒక్కటయ్యారు. ఈ నేపథ్యంలో యువతి గర్భం దాల్చగా పీజీ చేసేందుకు జర్మనీ వెళ్లివచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా అంటూ అబార్షన్ చేయించాడు.

 కాగా పెళ్లి గురించి మాట్లాడేందుకు ఈ నెల 1న దేవర కొండ తీసుకెళ్లిన రణథీర్.. పెళ్లి కావాలంటే రూ.8 కోట్లు కట్నంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రణథీర్ తల్లి రత్నమ్మ, సోదరుడు సుధీర్ రెడ్డి పెళ్లికి ఒప్పుకోలేదటూ.. యువతిని యూసఫ్ గూడలో వదిలేసి వెళ్లాడు. తర్వాత పెళ్లి మాటెత్తితే కుటుంబాన్ని అంతం చేస్తాం.. బ్రోతల్ కేసులో ఇరికిస్తా అంటూ బెదిరింపులకు దిగారు. దీంతో యువతి జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులపై ఐపీసీ సెక్షన్ 417, 420, 506 రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేసి డా.రణధీర్‌ను రిమాండ్‌కు తరలించారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement