వడదెబ్బతో ఐదుగురు మృతి | Five dead with sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో ఐదుగురు మృతి

May 29 2017 1:25 AM | Updated on Apr 4 2019 5:24 PM

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. వడదెబ్బ కారణంగా ఆదివారం రాష్ట్రంలోని వేర్వేరుచోట్ల ఐదుగురు మృతి చెందారు.

సాక్షి, నెట్‌వర్క్‌: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. వడదెబ్బ కారణంగా ఆదివారం రాష్ట్రంలోని వేర్వేరుచోట్ల ఐదుగురు మృతి చెందారు. నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ మండలం జప్తివీరప్పగూడేనికి చెందిన గుంజ వీరమ్మ (75),  శాలిగౌరారం మండలంలోని మాధారంకలాన్‌ గ్రామానికి చెందిన గంగాధరి రామ చంద్రయ్య(55) వడదెబ్బతో మృతి చెందారు.

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని అయిలాపూర్‌ గ్రామానికి చెందిన కుముటం శాంతి కుమార్‌(42), ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహ స్వామి దేవస్థాన అటెండర్‌ వావిలాల చంద్రయ్య (52), రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలోని మర్రిపల్లి గ్రామానికి చెందిన గడప లక్ష్మణ్‌ (63) మృతి చెందిన వారిలో ఉన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement