మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని నారాయణరావు కన్నుమూత | Ex mla ujjini narayana rao died | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని నారాయణరావు కన్నుమూత

Jul 13 2016 8:28 AM | Updated on Sep 4 2017 4:47 AM

సీపీఐ సీనియర్ నేత, నల్లగొండ జిల్లా మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జని నారాయణరావు (90) అనారోగ్యంతో కన్నుమూశారు.

హైదరాబాద్ : సీపీఐ సీనియర్ నేత, నల్లగొండ జిల్లా మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జని నారాయణరావు (90) అనారోగ్యంతో కన్నుమూశారు. ఎల్బీనగర్లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన బుధవారం మరణించారు.  కాగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో నగరంలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు.

చికిత్స పొందుతూనే ఆయన కొద్దిసేపటి క్రితం కన్నుముశారు. ఉజ్జిని నారాయణరావు వరుసగా మునుగోడు నియోజకవర్గం నుంచి  మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన మృతిపట్ల సీపీఐ పార్టీ సంతాపం తెలిపింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement