తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు | Errolla Srinivas is Telangana sc and st commission chairman | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు

Jan 3 2018 3:37 AM | Updated on Aug 15 2018 9:40 PM

Errolla Srinivas is Telangana sc and st commission chairman - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్‌ చైర్మన్‌గా ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను నియమించింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం సంతకం చేశారు. ఎర్రోళ్ల శ్రీనివాస్‌ సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం గణపూర్‌కు చెందిన యువ నాయకుడు. కమిషన్‌ సభ్యులుగా బోయిళ్ల విద్యాసాగర్‌ (సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండలం ఎడవల్లి), ఎం.రాంబాల్‌ నాయక్‌ (రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పోడగుట్ట తండా), కుర్సం నీలాదేవి (ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండ మండలం రాయగూడ), సుంకపాక దేవయ్య (హైదరాబాద్‌లోని రాంనగర్‌), చిలకమర్రి నర్సింహ (రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ముచ్చింతల)ను నియమించారు. దీనికి సంబంధించి త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement