
ధర్మవరపు సుబ్రమణ్యం వర్ధంతి
ప్రముఖ హాస్య నటుడు, దివంగత ధర్మవరపు సుబ్రమణ్యం ప్రధమ వర్ధంతి.....
చైతన్యపురి: ప్రముఖ హాస్య నటుడు, దివంగత ధర్మవరపు సుబ్రమణ్యం ప్రధమ వర్ధంతిని బుధవారం ఉదయం దిల్‌సుఖ్‌నగర్ శారదానగర్‌లోని ఆయన నివాసంలో నిర్వహించనున్నారు. అనారోగ్య కారణంగా గత సంవత్సరం డిసెంబర్ 7న చైతన్యపురిలోని ఓ ఆసుపత్రిలో ఆయన మరణించారు. ప్రకాశం జిల్లా కొమ్మినేని పాలెం గ్రామంలో జన్మించిన ధర్మవరపు ‘ఆనందోబ్రహ్మ’ సీరియల్ ద్వారా నటుడుగా పరిచయమై ఎన్నో చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి తెలుగు ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు.
వర్ధంతి సభకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతారని కుటుంబ సభ్యులు తెలిపారు.అశోక్‌నగర్‌లోని సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉదయం 9 గంటల నుంచి సుబ్రమణ్యేశ్వర షష్టి కల్యాణ మహోత్సవం.