‘సాక్షి’పై పరువునష్టం దావా | Defamation case against sakshi | Sakshi
Sakshi News home page

‘సాక్షి’పై పరువునష్టం దావా

Mar 9 2016 3:22 AM | Updated on Jul 25 2018 4:09 PM

‘సాక్షి’పై పరువునష్టం దావా - Sakshi

‘సాక్షి’పై పరువునష్టం దావా

రాజధానిలో భూములు కొనుగోళ్ల కథనాలపై మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు ‘సాక్షి’ పత్రికపైన, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపైన ఆరోపణలు గుప్పించారు.

మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి

 సాక్షి, హైదరాబాద్: రాజధానిలో భూములు కొనుగోళ్ల కథనాలపై మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు ‘సాక్షి’ పత్రికపైన, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపైన ఆరోపణలు గుప్పించారు. మంగళవారం ఎన్‌టీఆర్ భవన్‌లో వారు విలేకరులతో మాట్లాడారు. తాము కొనుగోలు చేయని భూములను కొన్నట్లుగా ‘సాక్షి’లో వార్తలు రాశారని, దీంతో తమ భూముల ధరలు తగ్గుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారని వారు చెప్పారు. ‘సాక్షి’లో వచ్చిన కథనాలపై తాము పరువు నష్టం దావా వేయటంతోపాటు నోటీసులు పంపిస్తున్నామన్నారు. ‘సాక్షి’ పత్రికపై క్రిమినల్ కేసులు కూడా పెడతామన్నారు. తాను మూడువేల ఎకరాలు కొనుగోలు చేశానని, దాని విలువ రూ.పదివేల కోట్లని రాశారని మంత్రి నారాయణ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement