వంట నూనెలో ఎలుక కలకలం | Deadly rat appears in Cook oil after buying from a mega showroom | Sakshi
Sakshi News home page

వంట నూనెలో ఎలుక కలకలం

Dec 23 2015 4:30 PM | Updated on Sep 3 2017 2:27 PM

వంట నూనెలో ఎలుక కలకలం

వంట నూనెలో ఎలుక కలకలం

ఇప్పటికే కల్తీపాలు, కల్తీ నెయ్యి, కల్తీ మసాలాలు హైదరాబాదీల ప్రాణాలు హరిస్తుంటే తాజాగా.. ఓ పెద్ద షోరూంలో కొన్న నూనెలో ఎలుక రావడంతో మళ్లీ కలకలం రేగింది.

రామంతపూర్: ఇప్పటికే కల్తీపాలు, కల్తీ నెయ్యి, కల్తీ మసాలాలు హైదరాబాదీల ప్రాణాలు హరిస్తుంటే తాజాగా.. ఓ పెద్ద షోరూంలో కొన్న నూనెలో ఎలుక రావడంతో మళ్లీ కలకలం రేగింది. నగరంలోని రామంతపూర్‌లో నివాసముంటున్న చక్రవర్తి అనే వ్యక్తి ఆకాశవాణిలో పని చేస్తున్నారు. ఆయన ఈ నెల ఒకటో తారీకున దగ్గరలో ఉన్న ఒక మాల్ నుంచి సరుకులు తెచ్చారు.

అందులో భాగంగా ఓ కంపెనీకి చెందిన వంట నూనె కొనుగోలు చేశారు. ఈ రోజు నూనె ప్యాకెట్ కత్తిరించి చూడగా.. అందులో ఎలుక కనిపించింది. దీంతో ఆయన సిబ్బందిని సంప్రదించగా.. బిల్లు తీసుకురావాలని.. బిల్లు లేకపోతే తనకెలాంటి సంబంధం లేదని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement