కరెంటు తీగలు ఒకదానికొకటి రాసుకుని.. | Current wires rubs to make fire mishap | Sakshi
Sakshi News home page

కరెంటు తీగలు ఒకదానికొకటి రాసుకుని..

May 22 2016 8:47 PM | Updated on Mar 28 2018 11:26 AM

వేలాడుతున్న కరెంటు తీగలు ఒకదానికొకటి రాసుకోవడంతో నిప్పు రవ్వలు చెలరేగి ఓ గుడిసె దగ్దమయ్యింది.

పరిగి(రంగారెడ్డి జిల్లా): వేలాడుతున్న కరెంటు తీగలు ఒకదానికొకటి రాసుకోవడంతో నిప్పు రవ్వలు చెలరేగి ఓ గుడిసె దగ్దమయ్యింది. ఈ సంఘటన దోమ మండల కేంద్రంలోని వ్యవసాయ పొలాల వద్ద ఆదివారం మద్యాహ్నం చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలు.. దోమ మండలానికి చెందిన బోయిని నర్సింహులు తమ పొలం వద్ద గుడిసె కట్టుకుని అందులోనే తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. కాగా ఆ గుడిసెకు సమీపం నుంచే కరెంటు వైర్లు ఉండటంతో పాటు అవి కిందకు వేలాడుతున్నాయి. మద్యాహ్నం కాస్తా గాలి ఎక్కువగా రావటంతో వేలాడుతున్న రెండు వైర్లు ఒకటికొకటి రాసుకున్నాయి.

దీంతో నిప్పు రవ్వలు చెలరేగి గుడిసె తగలబడింది. పొలంలో పనులు చేసుకుంటున్న కుటుంబీకులు వచ్చి ఆర్పే ప్రయత్నం చేసే లోపు గుడిసె తగలబడింది. గుడిసెలో ఉన్న ఆరు ఉల్లిగడ్డ సంచులు, ఇతర వంట సామాగ్రి, బట్టలు, వ్యవసాయ సామాగ్రి తగలబడి పోయాయని బాధితు రైతు పేర్కొన్నాడు. సుమారుగా రూ. 40 వేల ఆస్తి నష్టం జరిగినట్లు అతను పేర్కొన్నాడు. తనకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement