క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్ | Cricket betting gang arrested | Sakshi
Sakshi News home page

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

Jun 13 2016 6:46 PM | Updated on Sep 4 2018 5:21 PM

భారత్- జింబాంబ్వే వన్డే సీరీస్‌లో భాగంగా ఈ రోజు జరిగిన రెండో వన్డే సందర్భంగా బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

భారత్- జింబాంబ్వే వన్డే సీరీస్‌లో భాగంగా ఈ రోజు జరిగిన రెండో వన్డే సందర్భంగా బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 81 వేల నగదుతో పాటు 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు చెందిన మరో నలుగురు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.

 

Advertisement
 
Advertisement
Advertisement