
క్రాఫ్ట్ బజార్
హైదరాబాద్ ముత్యాలు, కొండపల్లి బొమ్మలు, నిర్మల్ పెయింటింగ్స్... వెంకటగిరి, నారాయణపేట, పోచంపల్లి, ఉప్పాడ, మంగళగిరి సిల్క్ శారీస్ నగరవాసుల మనసు దోస్తున్నాయి.
హైదరాబాద్ ముత్యాలు, కొండపల్లి బొమ్మలు, నిర్మల్ పెయింటింగ్స్... వెంకటగిరి, నారాయణపేట, పోచంపల్లి, ఉప్పాడ, మంగళగిరి సిల్క్ శారీస్ నగరవాసుల మనసు దోస్తున్నాయి. లేపాక్షి హస్త కళల అభివృద్ధి సంస్థ దోమలగూడ ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ‘లేపాక్షి క్రాఫ్ట్ బజార్’లో ఇలాంటివెన్నో ఆకర్షణీయమైన వెరైటీలు.
శుక్రవారం ప్రారంభమైన ఈ ఎక్స్‌పోలోని 150 స్టాల్స్‌లో తెలుగు రాష్ట్రాల చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలు, అల్లికలు, కళాకృతులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. హస్తకళల అభివృద్ధి సంస్థ ఎండీ శైలజా రామయ్యర్ ఇందులోని ఉత్పత్తులను ఆసక్తిగా తిలకించారు. ఈ నెల 15 వరకు ప్రదర్శన కొనసాగుతుంది.
కవాడిగూడ