భవానీ నగర్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం రాత్రి ఆటో డ్రైవర్ రభస ఘటనలో..
హైదరాబాద్: భవానీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ ప్రసాదరావుపై దాడి ఘటనలో నిందితుడు సయ్యద్ బిన్ మహమ్మద్ ను అరెస్టు చేసినట్లు సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు. నిందితుడిపై సెక్షన్లు 305, 306ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. విధుల్లో ఉదాసీనతగా ఉన్నందుకు ఎస్ఐ ప్రసాదరావును, ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు కానిస్టేబుల్ కిరణ్ కుమార్ లను వీఆర్ కు పంపుతున్నట్లు చెప్పారు.
శాంతి భద్రతలకు అవరోధం కలిగించే వారు ఎంతటివారైనా ఉపేక్షించమని తెలిపారు. ఈ ఘటనలో అడిషనల్ ఇన్ స్పెక్టర్ కరుణాకర్ రెడ్డికి చార్జ్ మెమో ఇచ్చినట్లు వివరించారు.