breaking news
Bhavani nagar police station
-
ఎస్సైపై దాడి ఘటనలో ఆటో డ్రైవర్ అరెస్టు
హైదరాబాద్: భవానీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ ప్రసాదరావుపై దాడి ఘటనలో నిందితుడు సయ్యద్ బిన్ మహమ్మద్ ను అరెస్టు చేసినట్లు సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు. నిందితుడిపై సెక్షన్లు 305, 306ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. విధుల్లో ఉదాసీనతగా ఉన్నందుకు ఎస్ఐ ప్రసాదరావును, ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు కానిస్టేబుల్ కిరణ్ కుమార్ లను వీఆర్ కు పంపుతున్నట్లు చెప్పారు. శాంతి భద్రతలకు అవరోధం కలిగించే వారు ఎంతటివారైనా ఉపేక్షించమని తెలిపారు. ఈ ఘటనలో అడిషనల్ ఇన్ స్పెక్టర్ కరుణాకర్ రెడ్డికి చార్జ్ మెమో ఇచ్చినట్లు వివరించారు. -
మహిళా చైన్ స్నాచర్లకు కౌన్సెలింగ్
యాకుత్‌పురా(హైదరాబాద్): పోలీసులు చేపట్టిన నేరస్తుల సమగ్ర సర్వేలో గురువారం భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న తల్లీకూతుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారికి కౌన్సెలింగ్ నిర్వహించి ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని దక్షిణ మండలం డీసీపీ వి. సత్యనారాయణ హెచ్చరించారు. వివరాల ప్రకారం... తలాబ్‌కట్టా ఆమన్‌నగర్-బి ప్రాంతానికి చెందిన కైరున్నీసా (45)కు ఫౌజియా (19), మరో బాలిక (13)లు కూతుళ్లున్నారు. కైరున్నీసా గత కొన్ని నెలలుగా కూతుళ్లతో కలిసి నగరంలోని పలు ప్రాంతాల్లో పిక్ ప్యాకెటింగ్, చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. సుల్తాన్‌బజార్‌లో రెండు, అఫ్జల్‌గంజ్‌లో రెండు, చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు నమోదై ఉన్నాయి. నేరస్తుల సర్వేలో అదుపులోకి తీసుకున్న వీరిని విచారించి వదిలేశారు.