పోలీసుల అదుపులో 70మంది యువకులు | cordon search in pathabasthi in hyderabad | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో 70మంది యువకులు

Oct 5 2015 10:14 AM | Updated on Sep 3 2017 10:29 AM

పోలీసుల అదుపులో 70మంది యువకులు

పోలీసుల అదుపులో 70మంది యువకులు

పాతబస్తీలోని 9 చోట్ల ఆదివారం తెల్లవారుజామున దక్షిణ మండల పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.

హైదరాబాద్: పాతబస్తీలోని 9 చోట్ల ఆదివారం తెల్లవారుజామున దక్షిణ మండల పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నగరంలో చైన్ స్నాచర్స్ రెచ్చిపోతుండటంతో.. వారిని అదుపులోకి తీసుకురావడానికి ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కార్డన్ సెర్చ్లో బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 70 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుంచి 40 ద్విచక్రవాహనాలు, మూడు ఆటోలు, ఒక టాటాసుమో వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజామున ప్రారంభమైన దాడులు ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. అనుమానాస్పద యువకులతో పాటు, రౌడీ షీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement