‘రాజకీయ అవసరాల కోసమే నయీమ్‌ కేసు’ | congress mla jeevan reddy slams trs | Sakshi
Sakshi News home page

‘రాజకీయ అవసరాల కోసమే నయీమ్‌ కేసు’

Dec 30 2016 11:56 AM | Updated on Oct 16 2018 9:08 PM

నయీమ్‌ కేసును రాజకీయ అవసరాల కోసం వాడుకున్నట్టుగా ఉందని ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొసాగుతున్నాయి. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి శుక్రవారం మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు. నయీమ్‌ కేసులో సంబంధాలు ఉన్న వారిని వదిలి పెట్టేది లేదని సీఎం కేసీఆర్‌ అన్నారని, కానీ ఇప్పుడు హోమ్‌ శాఖ కోర్టుకు ఇచ్చిన రిపోర్టు విరుద్ధంగా ఉందని జీవన్‌ రెడ్డి తెలిపారు. రాజకీయ నాయకులకు సంబంధాలు ఉన్నాయని.. సిట్‌ విచారణ జరుగుతుందని లీకు ఇచ్చారన్నారు. మండలి డిప్యూటీ చైర్మన్‌ కు సంబంధాలు ఉన్నట్టు వార్తలు వచ్చాయని గుర్తు చేశారు. నయీమ్‌ కేసును రాజకీయ అవసరాల కోసం వాడుకున్నట్టుగా ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ నేతల బండారం పడుతుందనే ప్రభుత్వం నయీమ్‌ కేసును నీరు కారుస్తుందని మండిపడ్డారు. కేసును సీబీఐ కు అప్పగిస్తేనే అన్ని విషయాలు బయటకు వస్తాయని జీవన్‌ రెడ్డి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement