ఓడింది కాంగ్రెస్ కాదు...సర్వే సత్యనారాయణ | congress leader shankar rao comments on congress defeat in warangal by-election | Sakshi
Sakshi News home page

ఓడింది కాంగ్రెస్ కాదు...సర్వే సత్యనారాయణ

Nov 25 2015 1:20 PM | Updated on Sep 3 2017 1:01 PM

ఓడింది కాంగ్రెస్ కాదు...సర్వే సత్యనారాయణ

ఓడింది కాంగ్రెస్ కాదు...సర్వే సత్యనారాయణ

వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల్లో ఓడింది కాంగ్రెస్ పార్టీ కాదని, అభ్యర్థి సర్వే సత్యనారాయణ అని మాజీ మంత్రి, సీనియర్ నేత శంకర్రావు వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ : వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల్లో ఓడింది కాంగ్రెస్ పార్టీ కాదని, అభ్యర్థి సర్వే సత్యనారాయణ అని మాజీ మంత్రి, సీనియర్ నేత శంకర్రావు వ్యాఖ్యానించారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ సర్వే స్థానికుడు కాకపోవడం వల్లే అతడిని ప్రజలు ఓడించారన్నారు. గత ఏడాది మల్కాజ్గిరి నుంచి  పోటీ చేసిన సర్వే సత్యనారాయణకు డిపాజిట్ కూడా దక్కలేదని శంకర్రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

 

కాగా కాంగ్రెస్‌కు 1,56,311 ఓట్లు వచ్చిన విషయం తెలిసిందే. 2014 సాధారణ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు లక్షకుపైగా ఓట్లు తగ్గాయి. దీనిపై టీపీసీసీ నేతలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి దారుణమైన ఫలితాలను ఊహించలేకపోయామని, ఇది తమను షాక్‌కు గురి చేసిందని టీపీసీసీ, సీఎల్పీ ముఖ్యులు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్‌కు గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లలో సుమారు 2.7% టీఆర్‌ఎస్ వైపు మళ్లినట్టు ఎన్నికల గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement