మెట్రోలతో పోటీ | Competes with Metro | Sakshi
Sakshi News home page

మెట్రోలతో పోటీ

Jan 10 2016 11:58 PM | Updated on Sep 3 2017 3:26 PM

మెట్రోలతో పోటీ

మెట్రోలతో పోటీ

విశ్వనగరం దిశగా వడివడి అడుగులేస్తున్న భాగ్యనగరి...అభివృద్ధి విషయంలో దేశంలోని మెట్రోపాలిటన్ నగరాలతో పోటీ పడుతోంది.

విశ్వనగరం దిశగా వడివడి అడుగులేస్తున్న భాగ్యనగరి...అభివృద్ధి విషయంలో దేశంలోని మెట్రోపాలిటన్ నగరాలతో పోటీ పడుతోంది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాంపిటేటివ్‌నెస్ ఇండియా సంస్థ 2015లో నిర్వహించిన సర్వేలో నాలుగో స్థానం సంపాదించి సత్తా చాటింది. ఈ సంస్థ ఆయా నగరాల్లో 800 అంశాలను పరిశీలించి  సిటీలకు ర్యాంకులిచ్చింది. సర్వేలో పరిగణనలోకి తీసుకున్న అంశాల్లో.. భౌతిక వనరులు, ఆర్థిక పరిస్థితి, మౌలిక వసతులు, పరిపాలన, మానవ సామర్థ్యం, జనాభా, సంపద పంపిణీ, వ్యాపార ప్రోత్సాహకాలు, వ్యవస్థాగత సహకారం తదితరాలు ఉన్నాయి. ఈ సర్వేలో 69.73 స్కోర్ సాధించి ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. చివరి రెండు స్థానాల్లో నిలిచిన పుణె 59.85, అహ్మదాబాద్ 58.04 పాయింట్లు సాధించడం విశేషం. సర్వేలో మెట్రోపాలిటన్ సిటీలు సాధించిన స్కోర్, ర్యాంకుల వివరాలిలా ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement