తెలంగాణ కొత్త మద్యం పాలసీపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుక్రవారం సాయంత్రం సమీక్ష జరిపారు.
హైదరాబాద్: తెలంగాణ కొత్త మద్యం పాలసీపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుక్రవారం సాయంత్రం సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి మంత్రి పద్మారావు, కమిషనర్ చంద్రవదన్, ఇతర అధికారులు హాజరయ్యారు. అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
'అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం విధానం అమలు కానుంది. ఈ నెలాఖరుకల్లా మద్యం నోటిఫికేషన్ విడుదల చేస్తాం. అందులో హైదరాబాద్ నగరానికి ప్రత్యేక మద్యం పాలసీ ఉంటుంది. చౌకల మద్యం అందుబాటులోకి తెచ్చే విషయంపైన.. అదే విధంగా కర్ణాటక తరహాలో మద్యం అందించే విధానంపై చర్చిస్తాం. శాఖల సమన్వయంతో గ్రామాల్లో నుంచి గుడుంబాను పారద్రోలుతాం' అని అన్నారు. గుడుంబాను పూర్తి స్థాయిలో నిరోధించేందుకు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించామన్నారు. అదే విధంగా మద్యం పాలసీపై మరిన్ని మోడళ్లను పరిశీలించాలని సీఎం కేసీఆర్ అధికారులను కోరారు.