
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. సాయంత్రం 3.30 గంటలకు హైదరాబాద్ తార్నాకలోని ఏసీజే నివాసానికి వెళ్లి ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
దాదాపు గంటన్నరపాటు ఏసీజేతో సమావేశమైన తర్వాత సీఎం ప్రగతి భవన్‌కు వెళ్లిపోయారు. సీఎం రాక గురించి స్థానిక పోలీసులకు తప్ప మరెవరికీ తెలియదు. సీఎం వచ్చిన విషయాన్ని తెలుసుకున్న స్థానిక నాయకులు ఆయనను కలిసేందుకు అక్కడికి తరలివచ్చారు. అయితే సీఎం అప్పటికే ప్రగతి భవన్‌కు వెళ్లిపోయారు.