చిట్టీల విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ | chitfund groups aska justice madhannapeta PS in money conflicts | Sakshi
Sakshi News home page

చిట్టీల విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

Dec 2 2015 7:08 AM | Updated on Sep 3 2017 1:23 PM

చిట్టీల విషయంలో ఇరువర్గాలు నగరంలో పరస్పర దాడులకు పాల్పడ్డాయి.

హైదరాబాద్: చిట్టీల విషయంలో ఇరువర్గాలు నగరంలో పరస్పర దాడులకు పాల్పడ్డాయి. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి హైదరాబాద్ లోని మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నగదు విషయంలో తలెత్తిన గొడవ అనంతరం రెండు చిట్ఫండ్స్ గ్రూపుల వారు తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు.

కాగా, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ మాదన్న పీఎస్ ఎదుట ఓ వర్గం వారు ఆందోళనకు దిగినట్లు సమాచారం. ఇరువర్గాల వారు ఈ ఘటనపై ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement