చంద్రబోస్‌కు కాళోజీ స్మారక పురస్కారం | Chandrabose conferred 'Mahakavi Kaloji Smaraka Puraskaram' | Sakshi
Sakshi News home page

చంద్రబోస్‌కు కాళోజీ స్మారక పురస్కారం

Sep 6 2016 7:48 PM | Updated on Sep 4 2017 12:26 PM

చంద్రబోస్‌కు కాళోజీ స్మారక పురస్కారం

చంద్రబోస్‌కు కాళోజీ స్మారక పురస్కారం

ప్రముఖ సినీ గేయ రచయిత కనుకుంట్ల చంద్రబోస్‌ను మహాకవి కాళోజీ స్మారక పురస్కారానికి ఎంపిక చేశారు.

వెంగళరావునగర్ (హైదరాబాద్) : ప్రముఖ సినీ గేయ రచయిత కనుకుంట్ల చంద్రబోస్‌ను మహాకవి కాళోజీ స్మారక పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ నెల 14వ తేదీనాడు రవీంద్రభారతిలో జరగనున్న కాళోజీ పురస్కార వేడుకల్లో ఆయనకు ఈ పురస్కారం అందజేయనున్నారు. స్థానిక మధురానగర్‌ కాలనీలోని తెలుగు టీవీ ఫెడరేషన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారత్ కల్చరల్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దర్శక నిర్మాత నాగబాల సురేష్‌కుమార్ ఈ వివరాలను వెల్లడించారు.

ఏటా టెలివిజన్ రచయితల సంఘం, భారత్ కల్చరల్ అకాడమీ సంయుక్తంగా మహాకవి కాళోజీ స్మారక పురస్కారాలను వివిధ రంగాల్లో రాణిస్తున్న రచయితలకు అందజేస్తున్నదన్నారు. ఇందులో భాగంగా గత ఏడాది ఈ అవార్డును సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజకు, 2014లో జేకే భారవికి అందజేసినట్టు పేర్కొన్నారు. కాగా చంద్రబోస్‌కు పురస్కారం కింద ప్రశంసాపత్రం, జ్ఞాపిక, శాలువాతో పాటు రూ.10,116 నగదును అందించనున్నామన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement