చైన్ స్నాచర్ అరెస్ట్ : భారీగా బంగారం స్వాధీనం | chain snatcher in hyderabad huge gold seized | Sakshi
Sakshi News home page

చైన్ స్నాచర్ అరెస్ట్ : భారీగా బంగారం స్వాధీనం

Dec 11 2016 6:09 PM | Updated on Sep 4 2017 10:28 PM

సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న కరుడుగట్టిన నేరస్తుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

హైదరాబాద్ : సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న కరుడుగట్టిన నేరస్తుడు మొహమ్మద్ అమీర్‌ను పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. ఇతను గతంలో నగరంలో 34 చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి మీడియాకు తెలిపారు.

పీడీ యాక్ట్‌పై జైలుకు వెళ్లిన అమీర్ ఈ ఏడాది మార్చిలో విడుదలయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్లీ చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి 60 తులాల బంగారు నగలు, రెండు బైకులు, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement