జబర్దస్త్ వేణుపై కేసు నమోదు | case filed against Jabardasth Venu | Sakshi
Sakshi News home page

జబర్దస్త్ వేణుపై కేసు నమోదు

Dec 21 2014 6:23 PM | Updated on Aug 21 2018 8:23 PM

జబర్దస్త్ వేణుపై కేసు నమోదు - Sakshi

జబర్దస్త్ వేణుపై కేసు నమోదు

తెలుగు టీవీ కామెడీ షో జబర్దస్త్ వేణుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

హైదరాబాద్ : తెలుగు టీవీ కామెడీ షో జబర్దస్త్ వేణుపై పోలీసులు కేసు నమోదు చేశారు. వేణుపై 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వేణుపై దాడి చేసిన గౌడ సంఘం నేతలపై కూడా కేసు నమోదైంది. ఈ గొడవకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

శ్రామిక గౌడ మహిళా జీవన విధానాన్ని అవమానపర్చిన 'జబర్దస్త్' కార్యక్రమ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని గౌడ సంఘం జిల్లా  నాయకులు రెండ్రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 'జబర్దస్త్' కార్యక్రమంలో కల్లు వృత్తిని, శ్రామికగౌడ మహిళా జీవన విధానాన్ని అవమానించే విధంగా స్కిడ్ ప్రసారం చేశారని, వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వివాదం నడుస్తుండగానే ఆదివారం ఫిల్మ్ నగర్లో కొందరు వ్యక్తులు వేణుపై దాడి చేశారు.  ఈ ఘటనలో గాయపడిన అతడిని...స్నేహితులు చికిత్స నిమిత్తం అపోలో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

Advertisement
 
Advertisement
Advertisement