హబ్సీగూడలో భారీ కార్డన్ సెర్చ్


హైదరాబాద్‌సిటీ: హబ్సీగూడ పరిధిలోని జీజీకాలనీలో ఈస్ట్‌జోన్ డీసీపీ రవిందర్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్(నిర్బంధ తనిఖీలు) నిర్వహించారు.ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని..45 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో సుమారు 150 పోలీసులు పాల్గొన్నారు. శాంతిభద్రతల దృష్టితో హైదరాబాద్ పోలీసులు ఈ మధ్యకాలంలో తరచూ కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top