ఔటర్‌పై ​కారు దగ్ధం | car catches fire in outer ring road | Sakshi
Sakshi News home page

ఔటర్‌పై ​కారు దగ్ధం

May 18 2017 5:45 PM | Updated on Aug 14 2018 3:26 PM

ఔటర్ రింగ్ రోడ్డుపై కారులో మంటలు చెలరేగాయి.

రంగారెడ్డి: అబ్దుల్లా పూర్ మేట్ మండలం బ్రాహ్మణపల్లి ఔటర్ రింగ్ రోడ్డుపై  కారులో మంటలు చెలరేగాయి. గురువారం సాయంత్రం తుక్కుగూడ నుంచి ఘట్కేసర్క్‌ కు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కారు ఇంజిన్ లో మంటలు రావడంతో గమనించిన డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. కారును వెంటనే రోడ్డుపక్కన ఆపి అందులోని ముగ్గురినీ కిందికి దించాడు. కారు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. 

Advertisement
 
Advertisement
Advertisement