పార్క్ చేసి ఉన్న కారు బ్యాటరీ దొంగతనానికి గురైందని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
నాలుగు నిమిషాల్లోనే ముగించారు
Jun 12 2017 12:45 PM | Updated on Sep 2 2018 4:16 PM
హైదరాబాద్: పార్క్ చేసి ఉన్న కారు బ్యాటరీ దొంగతనానికి గురైందని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి ఆఫీసర్స్ కాలనీలో ఆదివారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. బాధితుడు ఆదివారం ఉదయం యధావిదిగా కారు తీస్తుండగా స్టార్ట్ అవ్వకపోవడంతో బ్యానేట్ ఓపెన్ ఉండటాన్ని గమనించాడు.
దీంతో స్థానిక ఇంట్లో సీసీ ఫుటేజ్ గమనించగా చిత్తు కాగితాలు ఏరుకోవడానికి అటువైపు వచ్చిన ముగ్గురు మహిళలు కారు నుంచి బ్యాటరీ దొంగలించడం రికార్డ్ అయింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానిక సింగరేణి కాలనీలోని మహిళల పనిగా పోలీసులు గుర్తించారు. నాలుగు నిమిషాల వ్యవధిలో తమన పని పూర్తి చేసుకుని మహిళలు పరారయ్యారు. చిత్తు కాగితాలు ఏరుకునే మహిళల రూపంలో వారు సంచరిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement