బెయిల్‌ రద్దు చేయండి | Cancellation of bail by the accused in the scam | Sakshi
Sakshi News home page

బెయిల్‌ రద్దు చేయండి

Sep 5 2017 3:15 AM | Updated on Sep 12 2017 1:51 AM

మియాపూర్‌ భూ కుంభకోణంలో నిందితులుగా ఉన్న బాలా నగర్, కూకట్‌పల్లి సబ్‌రిజిస్ట్రార్లు మహ్మద్‌ యూసఫ్, రాచకొండ శ్రీనివాసరావు, మేడ్చల్‌ సంయుక్త సబ్‌రిజిస్ట్రార్‌ టీవీ రమేశ్‌చందర్‌రెడ్డిల బెయిల్‌ను రద్దు చేయా లని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేసింది.

మియాపూర్‌ భూకుంభకోణం నిందితులపై ఏసీబీ

సాక్షి, హైదరాబాద్‌: మియాపూర్‌ భూ కుంభకోణంలో నిందితులుగా ఉన్న బాలా నగర్, కూకట్‌పల్లి సబ్‌రిజిస్ట్రార్లు మహ్మద్‌ యూసఫ్, రాచకొండ శ్రీనివాసరావు, మేడ్చల్‌ సంయుక్త సబ్‌రిజిస్ట్రార్‌ టీవీ రమేశ్‌చందర్‌రెడ్డిల బెయిల్‌ను రద్దు చేయా లని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ప్రతివాదులకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.సునీల్‌చౌదరి సోమవారం నోటీసులు జారీ చేశారు.

విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు. ఆదాయానికి మించి ఆస్తుల్ని కూడబెట్టారన్న కేసులో ఈ ముగ్గురూ నిందితులుగా ఉన్నారని, బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని ఏసీబీ వాదించింది. నిందితుల నుంచి మరింత సమా చారం రాబట్టాల్సి ఉందని తెలిపింది. కనుక కింది కోర్టు ఇచ్చిన బెయిల్‌ ఉత్తర్వులను రద్దు చేయాలని ఏసీబీ హైకోర్టును కోరింది.

Advertisement
 
Advertisement
Advertisement