'చంద్రబాబు యూజ్లెస్ సీఎం' | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు యూజ్లెస్ సీఎం'

Published Tue, Mar 1 2016 3:00 PM

'చంద్రబాబు యూజ్లెస్ సీఎం' - Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో విపక్షనేత సి రామచంద్రయ్య.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తీవ్ర స్థాయిలో విమర్శించారు. చంద్రబాబు పనికిమాలిన ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, టీడీపీలో మరో సమర్థుడికి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు సిగ్గులేకుండా పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని రామచంద్రయ్య మండిపడ్డారు. ఆయన విచ్చలవిడి అవినీతి వల్లే కేంద్రం సహకరించడం లేదని అన్నారు. ఓటుకు కోట్లు కేసును మాఫీ చేసుకోవడానికి చంద్రబాబు రాజీపడ్డారని ఆరోపించారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement