లక్షన్నర టన్నుల కందిని కొనండి | Sakshi
Sakshi News home page

లక్షన్నర టన్నుల కందిని కొనండి

Published Tue, Jan 30 2018 1:16 AM

Buy a hundred and a half tons of Pigeon pea - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో లక్షన్నర టన్నుల కందిని కొనుగోలు చేయాలని కేంద్రానికి వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ మరోసారి విజ్ఞప్తి చేయనుంది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి సి.పార్థసార«థి మం గళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర వ్యవ సాయశాఖ కార్యదర్శిని కలసి లక్షన్నర టన్నుల కందిని కొనుగోలు చేయాలని కోరతారు. రాష్ట్రంలో కేవలం 53,600 మెట్రిక్‌ టన్నుల కందిని మాత్రమే కొనుగో లు చేస్తామని కేంద్రం గతంలో ప్రకటించిం ది. కంది ఉత్పత్తి గణనీయంగా ఉన్నందు న పరిమితిని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది.  

ఈ ఏడాది రెండున్నర లక్షల మెట్రిక్‌ టన్నుల కంది ఉత్పత్తి అవుతుం దని ప్రభుత్వం అంచనా వేసింది. కేంద్రం మాత్రం రాష్ట్రంలో కేవలం 33,500 మెట్రిక్‌ టన్నులు మాత్రమే మద్దతుధరకు కొనుగో లు చేస్తానని ప్రకటించింది. ఒత్తిడి పెంచ డంతో ఇటీవల మరో 20 వేల టన్నులు కొనుగోలు చేస్తామని అంగీకరించింది. ఇలాగైతే, రైతులు కంది పంటను వ్యాపారులకు తెగనమ్ముకునే పరిస్థితి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement