
పుస్తకాలు అందకుండానే పద్దులపై చర్చా?
శాసనసభలో ఆదివారం పద్దులపై చర్చను ప్రారంభించడంపై విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది.
శాసనసభలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఆగ్రహం
♦ అధికార పక్షంలో ఎవరైనా ‘జీనియస్’ ఉంటే మాట్లాడొచ్చు..
♦ చర్చ కొనసాగిస్తే నిరసన తెలుపుతాన ని హెచ్చరిక
♦ అక్బరుద్దీన్‌కు మద్దతుగా నిలిచిన విపక్షాలు
♦ మిగతా వారికి తర్వాత సమయం ఇస్తామని స్పీకర్ వివరణ
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో ఆదివారం పద్దులపై చర్చను ప్రారంభించడంపై విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. పద్దుల పుస్తకాలు అందించకుండానే చర్చను ఎలా మొదలు పెడతారని విపక్షాల నేతలు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒకవేళ పుస్తకాలు ఇచ్చినా... ఒకరోజు గడువు కూడా ఇవ్వకుండా చర్చ సబబు కాదని స్పష్టం చేశారు. అందువల్ల పద్దులపై చర్చను వాయిదా వేయాలని కోరారు. ఆదివా రం శాసనసభలో ప్రశ్నోత్తరాలు ముగిశాక స్పీకర్ మధుసూదనాచారి పద్దులపై చర్చను మొదలుపెడుతున్నట్లు ప్రకటించారు. దీనిపై ఎంఐ ఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అభ్యంతరం తెలిపారు.
‘‘ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమానికి సంబంధించి పద్దులపై చర్చిస్తామన్నారు. వాటికి సంబంధించిన పద్దుల పుస్తకాలు కొద్దిసేపటి కిందే ఇచ్చారు. మిగతావి అందనే లేదు. డిమాండ్‌లపై కనీసం ఒకరోజు అయినా సమ యం ఇవ్వకుండా చర్చ ఎలా చేపడతారు..’’ అని ప్రశ్నించారు. పద్దుల పుస్తకాలు లేకుండా మాట్లాడేంత ‘జీనియస్’లు తమ పార్టీలో అ యితే లేరని, అధికార పక్షంలో అలా ఎవరైనా ఉంటే తమకు అభ్యంతరం లేదని వ్యాఖ్యానిం చారు. ఈ సమయంలో బీజేఎల్పీ నేత లక్ష్మణ్, టీడీ ఎల్పీ నేత రేవంత్‌రెడ్డి, సీపీఎం సున్నం రాజయ్య, సీపీఐ రవీంద్రకుమార్, వైఎస్సార్‌సీపీ నేత పాయం వెంకటేశ్వర్లు తదితరులకు మాట్లాడే అవకాశం ఇచ్చినా... వారంతా అక్బరుద్దీన్‌ను సమర్థించారు. పద్దుల పుస్తకాలు అం దకుండా చర్చ కొనసాగించరాదని కోరారు.
అయితే దీనిపై స్పందించిన స్పీకర్... విపక్షాల కు తర్వాత సమయం కేటాయిస్తామని, అధికా ర పక్షం నుంచి ఎవరైనా మాట్లాడితే చర్చ కొనసాగిద్దామంటూ గువ్వల బాలరాజుకు అవకాశమిచ్చారు. కానీ, అక్బరుద్దీన్ మరోమారు అభ్యంతరం తెలిపారు. ‘‘డిమాండ్ పుస్తకాలు ఇవ్వకుండా చర్చ మొదలుపెట్టడం దురదృష్టక రం. అలా ఎవరైనా మాట్లాడితే నిజంగా జీని యస్‌లే..’’ అని పేర్కొన్నారు. దీంతో మంత్రి కేటీఆర్ కల్పించుకుంటూ... డిమాండ్ పుస్తకా లు సిద్ధంకాలేదని, మరోసారి ఇలా జరగకుం డా చూస్తామని చెప్పారు. కావాలనుకుంటే విప క్ష సభ్యులు తర్వాతి రోజు మాట్లాడవచ్చని, ఇతరులకు అవకాశమిస్తే అభ్యం తర పెట్టొద్దని సూచించారు. అయినా అక్బరుద్దీన్ వెనక్కి తగ్గలేదు. నిబంధనలకు విరుద్ధంగా చర్చ కొనసాగిస్తామంటే సభ నుంచి వాకౌట్ చేసి నిరసన వ్యక్తం చేస్తామని స్పష్టం చేశారు. సకాలంలో పద్దుల పుస్తకాలు అందించని అధికారులపై చ ర్యలు తీసుకోవాలని కోరారు. పుస్తకాలు అం దించడంలో మరోసారి ఆలస్యం కాకుండా చూస్తామని ప్రకటిస్తూ స్పీకర్ సభకు టీ విరా మం ప్రకటించారు. అనంతరం పద్దులపై గువ్వల బాలరాజు చర్చను ప్రారంభించారు.
గిరిజన శాఖ పద్దు పుస్తకాలపై గందరగోళం
సాక్షి, హైదరాబాద్: పద్దులకు సంబంధించి అసెంబ్లీకి సమర్పించే పుస్తకాల విషయంలో నెలకొ న్న గందరగోళ పరిస్థితులు ఆఖరికి గిరిజన సంక్షేమ శాఖపై చర్చను వాయిదా వేసేందుకు కారణమయ్యాయి. పద్దులకు సంబంధించి శాఖల వారీగా అధికారులు పుస్తకాలను ముద్రించి సభ ముందుంచుతారు. బడ్జెట్ సమయంలో ఆర్థిక శాఖకు సంబంధించి ప్రకటనలు, కేటాయింపులతో కూడిన వివరాలను ఒక పుస్తకంగా, బడ్జెట్‌లో కేటాయించిన నిధులు, సవరణ బడ్జెట్ వివరాలు మరో పుస్తకంలో ముద్రించడం ఆనవాయితీ. రెండు పుస్తకాలు ముద్రించడం వల్ల ఖర్చు పెరుగుతోందని పేర్కొంటూ ఉమ్మడి రాష్ట్ర ఆర్థిక శాఖ ఓ సూచన చేసింది.
అన్ని వివరాలను ఒకే పుస్తకంగా ముద్రించాలని సూచించింది. దీన్ని చాలా శాఖలు పట్టించుకోలేదు. కానీ, గిరిజన సంక్షేమ శాఖ మాత్రం ఒకే పుస్తకంగా ముద్రించింది. ఆదివారం అన్ని శాఖల పద్దుల పుస్తకాల ను సభ ముందుంచారు. మిగిలిన శాఖల పుస్తకాలు రెండుగా ఉంటే, గిరిజన సంక్షేమ శాఖ పుస్తకం ఒకటే ఉంది. దీంతో రెండో పుస్తకం అందలేదంటూ ఎమ్మెల్యేలు గగ్గోలు పెట్టారు. సమాచారమంతా ఒకే పుస్తకంలో ఉందని విషయం అధికారుల నుంచి అందకపోవడంతో పొరపాటు జరిగిందన్న ఉద్దేశంతో ఆ శాఖపై చర్చను సోమవారానికి వాయిదావేశారు. విషయం తెలిసిన తర్వాత కూడా రెండో పుస్తకం కావాల్సిందేనని పట్టుపట్టారు.