నల్లధనాన్ని ఎక్కడ దాస్తారో కూడా తెలియదా? | black money will store in foreign countries, says Arun Shourie | Sakshi
Sakshi News home page

నల్లధనాన్ని ఎక్కడ దాస్తారో కూడా తెలియదా?

Jan 28 2017 5:27 PM | Updated on Apr 3 2019 5:16 PM

నల్లధనాన్ని ఎక్కడ దాస్తారో కూడా తెలియదా? - Sakshi

నల్లధనాన్ని ఎక్కడ దాస్తారో కూడా తెలియదా?

అక్రమ సంపాదనంతా విదేశాల్లోనే దాచి ఉంచారని, అది దేశంలో లేదని కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ జర‍్నలిస్ట్‌ అరుణ్‌శౌరి అన్నారు.

హైదరాబాద్‌: అక్రమ సంపాదనంతా విదేశాల్లోనే దాచి ఉంచారని, అది దేశంలో లేదని కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ జర‍్నలిస్ట్‌ అరుణ్‌శౌరి అన్నారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనాన్ని వెలికితీయడం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. నల్లధనం కూడబెట్టిన వ్యక్తి ఎవరైనా దానిని రూపాయల రూపంలోనే దాచి ఉంచుకుంటాడా? బ్లాక్‌మనీ ఉన్న వారెవరైనా దానిని విదేశాల్లోనే దాచి పెట్టుకుంటారని వ్యాఖ్యానించారు.

నల్లధనాన్ని కంపెనీలు, ఎస్టేట్లు కొనుక్కునేందుకు ఉపయోగిస్తారని చెప్పారు. డెంగీ దోమ స్విట్జర్లాండ్‌లో తిరుగుతూ ఉంటే దాని కోసం ఇక్కడ వెతకడమేంటని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నోట్లరద్దుతో బ్లాక్‌మనీని కట్టడి చేయటం సాధ్యమా కాదా, మంచిదా చెడ్డదా అనేది నేతలతో పాటు ప్రజలకు కచ్చితంగా తెలియదని అన్నారు. బ్యాంకింగ్‌ సెక్టార్‌ను వృద్ధి చేయటం, పన్నుల విధానాన్ని పటిష్టం చేయటంపై దృష్టి పెట్టాల్సి ఉండగా బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement