రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీకి సొంత కార్యాలయ భవనాలు నిర్మించాలని బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది.
రాష్ట్ర శాఖకు జాతీయ నాయకత్వం ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీకి సొంత కార్యాలయ భవనాలు నిర్మించాలని బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది. భవన నిర్మాణాలకోసం స్థల సేకరణ పూర్తిచేయాలని రాష్ట్ర శాఖకు ఇప్పటికే ఆదేశాలిచ్చింది. తెలంగాణలోని 10 జిల్లాల్లో పార్టీకి సొంత భవనాలు ఉండాల్సిందేనని, అందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పార్టీకి సూచనలు అందాయి.
కాగా, నల్లగొండ, నిజామాబాద్, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పార్టీకి ఇప్పటికే సొంత భవనాలున్నాయి. మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లా కేంద్రాల్లో సొంత భవనాలు లేవు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో స్థలసేకరణ పూర్తికాగా, మరికొన్ని జిల్లాల్లో స్థల పరిశీలన జరుగుతోంది. కొత్తగా నిర్మించబోయే పార్టీ కార్యాలయాలకు అన్ని జిల్లాల్లో ఒకే రకమైన డిజైన్ ఉండాలని కేంద్ర నాయకత్వం సూచనలు చేసింది. దీనికి అవసరమైన నిధులను కూడా కేంద్ర నాయకత్వమే సమకూర్చనుంది.