అమిత్ షా వచ్చి వెళ్లాక పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం మరింత పెరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు.
టీఆర్‌ఎస్‌కు గుబులు పట్టుకుంది: లక్ష్మణ్
May 29 2017 12:41 PM | Updated on May 28 2018 4:01 PM
హైదరాబాద్: అమిత్ షా వచ్చి వెళ్లాక పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం మరింత పెరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఇక మీదట పార్టీకి సంబంధించిన అన్నీ కార్యక్రమాలు బూత్ కేంద్రంగానే నిర్వహిస్తామన్నారు. నగరంలోని కవాడిగూడలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ.. మోదీ మూడేళ్ల పాలన పూర్తైన సందర్భంగా ఈ 15 రోజుల్లో 8 వేల మంది కార్యకర్తలు 50 లక్షల కుటుంబాలను కలుస్తారు. మోదీ పాలన, పథకాలు, విజయాల గురించి ప్రజాల్లోకి తీసుకెళ్లడంతో పాటు టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతాం. అమిత్‌షా వచ్చి వెళ్లిన మూడు రోజులకే టీఆర్‌ఎస్‌కు గుబులు పట్టింది. అందుకే సర్వేల పేరుతో అబద్ధాలు చెప్తున్నారని మండి పడ్డారు.
Advertisement
Advertisement