బైకును ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.
హైదరాబాద్ క్రైం: బైకును ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని ఖానాపూర్ సమీపంలో వట్టినాగులపల్లిలో ఆదివారం రాత్రి జరిగింది. వివరాలు.. గండిపేటకు చెందిన అంజిరెడ్డి బైకుపై వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో తీవ్రగాయాలపాలైన అతడిని లంగర్ హౌస్లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియ రావాల్సి ఉంది.