ఎయిర్‌పోర్టు పార్కింగ్‌లో బ్యాగ్ చోరీ | Bag robbered in shamsabad airport | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టు పార్కింగ్‌లో బ్యాగ్ చోరీ

May 10 2016 8:39 AM | Updated on Sep 3 2017 11:48 PM

కారులో పెట్టిన బ్యాగ్ చోరీ అయిన సంఘటన మంగళవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టు పార్కింగ్‌లో జరిగింది.

శంషాబాద్ (రంగారెడ్డిజిల్లా) : కారులో పెట్టిన బ్యాగ్ చోరీ అయిన సంఘటన మంగళవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టు పార్కింగ్‌లో జరిగింది. అదిలాబాద్‌కు చెందిన మార్కండేయ తన కారులో శంషాబాద్ ఎయిర్‌పోర్టు వచ్చాడు. కారును పార్కింగ్‌లో పెట్టాడు.

పార్కింగ్‌లో ఉన్న కారు అద్దాలు పగలగొట్టి అందులో వున్న బ్యాగ్‌ను గుర్తుతెలియన వ్యక్తులు చోరీ చేశారు. బ్యాగులో రెండు సెల్‌ఫోన్లు, డెబిట్‌కార్డులు, రెండున్నర తులాల బంగారం చోరీ అయినట్లు బాధితుడు ఎయిర్‌పోర్టు పోలీసులకు పిర్యాదు చేశాడు. పోలీసులు కేసును విచారిస్తున్న్రారు.

Advertisement
 
Advertisement
Advertisement