బ్రాహ్మణికి బాబు పరామర్శ | Babu visitation to Brahmani | Sakshi
Sakshi News home page

బ్రాహ్మణికి బాబు పరామర్శ

Mar 17 2016 12:22 AM | Updated on Aug 29 2018 1:59 PM

బ్రాహ్మణికి బాబు పరామర్శ - Sakshi

బ్రాహ్మణికి బాబు పరామర్శ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోడలు, సినీ హీరో నందమూరి బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణి స్వల్ప ...

బంజారాహిల్స్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోడలు, సినీ హీరో నందమూరి బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణి స్వల్ప అస్వస్థతకు గురై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈమేరకు బుధవారం ఉదయం చంద్రబాబు, బాలకృష్ణ ఆస్పత్రికి వచ్చి ఆమెను పరామర్శించారు. మంగళవారం ఉదయం మదీనాగూడ ఫామ్‌హౌస్‌లోని చంద్రబాబు నివాసంలో బ్రాహ్మణి స్పృహ తప్పి పడిపోయింది. దీంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి.

నీరసించడం వల్ల కళ్లు తిరిగి కింద పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. మంగళవారం రాత్రి చంద్రబాబు అసెంబ్లీ నుంచి నేరుగా అపోలోకు వచ్చి కోడలిని పరామర్శించారు. బుధవారం మళ్లీ ఆస్పత్రికి వచ్చిన ఆయన గంటసేపు అక్కడే గడిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. బ్రాహ్మణికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని, గురువారం డిశ్చార్జి చేస్తామని వైద్యులు          వెల్లడించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement