
లౌకికవాదానికి బాబు తూట్లు: వీహెచ్
విజయవాడలో గుళ్లు, గోపురాలను కూల్చివేయడం ద్వారా ఏపీ సీఎం చంద్రబాబు లౌకికవాదానికి తూట్లు పొడుస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ఆరోపించారు.
సాక్షి, హైదరాబాద్: విజయవాడలో గుళ్లు, గోపురాలను కూల్చివేయడం ద్వారా ఏపీ సీఎం చంద్రబాబు లౌకికవాదానికి తూట్లు పొడుస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ఆరోపించారు. హైదరాబాద్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విజయవాడలో చినజీయర్ స్వామి ఆశ్రమానికి కూతవేటు దూరంలోనే కూల్చివేతలు జరుగుతుంటే పీఠాధిపతులు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు.
పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామంటూ వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథాగా ఖర్చుచేస్తున్నారన్నారు. అభివృద్ధి పేరుతో దేశంలోని లౌకికవాదాన్ని దెబ్బకొడుతున్నారని మండిపడ్డారు.